అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగల్ స్ట్రోక్‌తో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని విమర్శించారు. ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. HYD- రవీంద్రభారతిలో మంగళవారం యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు.