ఆదిలాబాద్: వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ లోని అంగన్వాడి సెంటర్లలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కోటేశ్వర్, ఏఎన్ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్