ఆదిలాబాద్: హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు గురువారం తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండుగను జరుపుకోవాలన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్