భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొమరంభీం ప్రాజెక్ట్ డ్యామ్ గేట్లు ఏ క్షణంలో నైనా తెరిచే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కొమరంభీం ప్రాజెక్టు నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.