నీతి ఆయోగ్ లక్ష్యాలపై పురోగతి సాధించాలి: కలెక్టర్ కె.హరిత

నీతి ఆయోగ్‌లో భాగంగా ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో నిర్దేశించిన అంశాలపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రెవెన్యూ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిర్దేశిత పనులు పూర్తి చేయాలని, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతినెల అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్