ఎంపీడీఓ సుముఖం శేఖర్ కు ఘన వీడ్కోలు

ఆదిలాబాద్ జిల్లా, బోథ్ లోని నేరడిగొండ మండల ఎంపీడీఓ సుముఖం శేఖర్ గారు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని సూర్య గార్డెన్లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పలు మండలాల ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. 1987లో ఉద్యోగంలో చేరిన సుముఖం శేఖర్ గారితో తమకున్న అనుబంధాన్ని పలువురు వివరించారు. అనంతరం శాలువాలు కప్పి, పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్