ఈ నెల 6న బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండకూడదని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పిప్రి గ్రామంలో పర్యటించి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలిని పరిశీలించారు. అనంతరం స్థానిక రైతు వేదికలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.