ధన్నూర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి 40 సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న బస్సు సౌకర్యాన్ని ఎలాంటి కారణం లేకుండా రద్దు చేయడాన్ని వీడీసీ ఛైర్మెన్ నల్ల రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. మంగళవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డీఎం ప్రతిమారెడ్డిని కలిసి, బస్సు సర్వీస్‌ను యథావిధిగా పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. సర్వీస్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై డీఎం సానుకూలంగా స్పందించారని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్