చెన్నూర్ లోని కిష్టంపేట గ్రామంలో శుక్రవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో భూ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ గ్రామాల హద్దుల నిర్ధారణతోనే దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO మల్లికార్జున్, MPDO మోహన్‌లు పాల్గొన్నారు.