కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గాం, జిల్లెడ, మోరళిగూడా గ్రామాలను అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, శ్రద్ధా శుక్ల లు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం బాగోలేదని విన్నవించగా అదనపు కలెక్టర్ రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపి రోడ్డు పనులు త్వరగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.