ఓ చోదకుడి వద్ద డబ్బులు తీసుకున్న పెంచికల్‌పేట్ మండలం బీట్ అధికారిని అధికారులు శనివారం సస్పెండ్ చేశారు. 2025 జులై 3న పోతేపల్లికి చెందిన ట్రాక్టర్ చోదకుడు శేఖర్ వద్ద చేడ్వాయి బీట్ అధికారి మనోహర్ నగదు డిమాండ్ చేసి తీసుకున్నారు. బీట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు డీఎఫ్ఓ నీరజ్ కుమార్ తెలిపారు.