దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు రావడం లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ పిల్లలతోపాటు స్పెషల్ నీడ్స్ పిల్లలు కూడా ప్రేమను కోరుకుంటారని, వారిని వైకల్యం పేరుతో దూరం పెట్టకుండా దత్తత తీసుకొని జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని శిశు గృహాల్లో ప్రస్తుతం 144 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలు దత్తతకు సిద్ధంగా ఉన్నారని, వీరిలో 82 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. విదేశీ దంపతులు తెలంగాణ నుంచి 370 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలను దత్తత తీసుకెళ్లారన్నారు.