ఇరాన్‌లోని భారతీయులకు అడ్వైజరీ జారీ

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. రాబోయే 48 గంటలపాటు వారు ఉన్న చోటే ఉండాలని, విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్‌ల పైఅంతస్తులకు దూరంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని అడ్వైజరీలో పేర్కొంది. హైవేలపై ప్రయాణించాలనుకుంటే తప్పనిసరిగా ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని, రాయబార కార్యాలయం అద్దెకు తీసుకున్న హోటళ్లలో ఉన్నవారు దౌత్య సిబ్బందితో కాంటాక్ట్‌లో ఉండాలని పేర్కొంది. ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది.

సంబంధిత పోస్ట్