తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పార్టీల పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ‘ప్రధాని మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తాం. NDA కూటమి భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయిస్తాం. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’ అని స్పష్టం చేశారు.