ALERT: ఎల్లుండి నుంచి వారి సిలిండర్ కనెక్షన్‌లు కట్!

దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఒకే కుటుంబం పేరుతో బహుళ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిపై దృష్టి సారించింది. ఇప్పటికే అదనపు కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని వినియోగదారులను కోరగా, జూన్ 1 నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కనెక్షన్లపై చర్యలు ప్రారంభించనుంది. అలాంటి కనెక్షన్లకు రీఫిల్ బుకింగ్ సేవలు నిలిపివేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్‌లను అనుసంధానించాయి.

సంబంధిత పోస్ట్