త్రిపురలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని శనివారాలు సెలవు!

త్రిపుర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి, వారి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెంచేందుకు నెలలోని అన్ని శనివారాలను అధికారికంగా సెలవు దినాలుగా ప్రకటించింది. దీంతో వారానికి ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. ప్రజా సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆఫీసు పని సమయాన్ని ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త విధానం ఉద్యోగులకు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశాన్ని ఇస్తుందని, వ్యక్తిగత అభివృద్ధి, విశ్రాంతి, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్