ఎనిమిదో షెడ్యూల్‌లో కొత్త భాషల చేర్పుపై రాజ్యసభలో ప్రకటన

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో కుర్మీతో పాటు మరికొన్ని భాషలను చేర్చాలనే డిమాండ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం ఏ భాషను చేర్చాలనేదానికి నిర్దిష్ట ప్రమాణాలు లేవని, భాషల అభివృద్ధి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పహ్వా, సీతాకాంత్ మహాపాత్ర కమిటీలు ప్రమాణాలు రూపొందించే ప్రయత్నాలు చేసినా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని, అందువల్ల కొత్త భాషల చేర్పుపై ఎలాంటి గడువు నిర్ణయించలేమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్