హోండా నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 'హోండా QC3' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ 3kWh ఫిక్స్‌డ్ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 145 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌కు 4 గంటల సమయం పడుతుంది. 5-అంగుళాల TFT డిస్‌ప్లే, రోడ్‌సింక్ కనెక్టివిటీ, నావిగేషన్, 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్తా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕