సింగరేణి చరిత్రలో మరో మైలురాయి

ఒడిశాలోని సింగరేణి నైనీ గని నుంచి తొలి బొగ్గు రైల్వే వ్యాగన్‌ తెలంగాణకు చేరడంతో సింగరేణి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మంచిర్యాల జిల్లా జైపుర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి ఈ బొగ్గు రైలు చేరుకుంది. ఈ రైలులో 59 వ్యాగన్ల ద్వారా 4వేల టన్నుల జీ-10 గ్రేడ్‌ బొగ్గు తరలించారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం, కార్మికులకు ఉప ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి చరిత్రలో ఇది ఒక అద్భుత ఘట్టమని ఆయన అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్