సింగరేణి డిస్మిస్డ్‌ ఉద్యోగులకు మరో అవకాశం

TG: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో గైర్హాజరు కారణంగా 2023 నుండి 2025 మధ్య విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. 2026 ఏప్రిల్ నాటికి 46 ఏళ్ల వయస్సు ఉండి, గత ఐదేళ్లలో ఏవైనా రెండేళ్లు కనీసం 100 మస్టర్లు పూర్తి చేసిన వారు అర్హులు. వైద్యపరంగా ఫిట్‌గా ఉన్న అభ్యర్థులు ఈ నెల 14లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕