ఆంధ్రప్రదేశ్‌కు మరో వందే భారత్ రైలు రానున్నట్టు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. బుధవారం నరసాపురం–అరుణాచలం ప్రత్యేక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నరసాపురం–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. టికెట్ చార్జీలు కొంచెం ఎక్కువైనా, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడం వల్ల ప్రయాణికులకు ఇది ఎంతో ప్రయోజనకరమని అన్నారు.