HDFC బ్యాంక్‌ సీఈఓగా అనుప్‌ బాగ్చీ

HDFC బ్యాంక్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా అనుప్‌ బాగ్చీ నియమితులయ్యారు. బ్యాంక్‌ బోర్డు ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 27న ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ నుంచి బాగ్చీ బాధ్యతలు స్వీకరించనున్నారు. HDFC బ్యాంకులో దాదాపు మూడు దశాబ్దాల పాటు పనిచేసిన జగదీశన్‌ అక్టోబర్‌ 26న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకానికి పరిశీలనలో ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్న నేపథ్యంలో బోర్డు కొత్త వారసుడిని ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕