AP ప్రభుత్వం వచ్చే నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఆగస్టులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో వివరించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. అమరావతి రాజధాని అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. అదనంగా, కొన్ని కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.