ఏపీ తరహాలో టూరిస్ట్‌ వాహనాల పన్ను విధానానికి సర్కార్ కసరత్తు

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టూరిస్ట్‌ వాహనాల పన్ను విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి రవాణాశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీలో ఆల్‌ ఇండియా టూరిస్ట్‌ పర్మిట్‌ కలిగిన కాంట్రాక్ట్‌ క్యారేజీలకు ఒకో సీటుపై త్రైమాసికంగా రూ.2,500 పన్ను విధిస్తున్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వానికి ప్రతి త్రైమాసికం కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్