TG: ఎస్టీ రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కోసం నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసిన 37 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుర్తించినట్లు సమాచారం. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకకు చెందిన విద్యార్థులు అధికారులకు లంచాలు ఇచ్చి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. 37 మందిలో ఇప్పటికే 9 మందికి ఎంబీబీఎస్ సీట్లు అలాట్ కాగా వారి సీట్లను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించినట్లు తెలుస్తోంది.