స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో తెలుగు తేజం జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రీతికా ప్రదీప్‌ల త్రయం శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో రజతం కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ గురి అదరడంలో కాంస్యం కూడా వచ్చింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో భారత బృందం ఫైనల్‌కు దూసుకెళ్లింది. పసిడి పోరులో ఒత్తిడికి లోనై రెండో స్థానానికే పరిమితమైంది.