యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీల అమలుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, కొన్ని లావాదేవీలకు మినహాయింపు ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పెట్రోల్ బంకుల్లో MDR ఛార్జీల అమలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ఈ విషయంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల, రూ.2000 కంటే ఎక్కువ చెల్లింపులపై పెట్రోల్ బంక్ డీలర్లు రూ.5 చొప్పున MDR చెల్లించాలని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో, పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇవ్వడంపై కేంద్రం దృష్టి సారించింది.