TG: రాష్ట్రంలో అర్హులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. దీంతో కొత్తగా కార్డు పొందిన వారు ఆటోమెటిక్‌గా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులవుతున్నారు. ఇలా అర్హులైన వారి సంఖ్య 30 లక్షలకు పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.1,590 కోట్లు చెల్లించింది. కాగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.