ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జోజిలా టన్నెల్, కశ్మీర్‌ను లడఖ్‌తో అనుసంధానిస్తూ ఆసియాలోనే అతి పొడవైన సొరంగంగా రూపుదిద్దుకుంటోంది. 2026 నాటికి ఈ మెగా ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా లడఖ్‌ను దేశ మిగిలిన ప్రాంతాలతో కలిపే కీలక మార్గంగా ఇది మారనుంది. ఇప్పటికే 2024 మార్చి నాటికి టన్నెల్ పనుల్లో 70 శాతం వరకు పూర్తి కాగా, మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.