అస్సాం అసెంబ్లీ గురువారం బహుభార్యత్వం, బహుభర్తృత్వంపై నిషేధం విధిస్తూ 'అస్సాం బహుభార్యత్వ నిషేధ బిల్లు 2025'ను ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం, మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి వివాహం గురించి దాచిపెట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు, ఏరియాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చారు.