ఐదు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక బిల్లును సభలో ఉంచారు. తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) బిల్లు-2025, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025, మరియు తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు-2025తో సహా మొత్తం ఐదు బిల్లులను సభ ఆమోదించింది.

సంబంధిత పోస్ట్