పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల ముందు న్యాయాధికారులను గంటల తరబడి బంధించడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్ల తొలగింపు వివాదం ముట్టడి వరకు వెళ్లింది. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రజల ఆగ్రహమే కారణమని, ఇది బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఎన్నికల సంఘం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని, ఈసీ బాధ్యతే న్యాయాధికారుల రక్షణ అని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.