పెద్ద పులిని మత్తు ఇంజక్షన్ ద్వారా పట్టుకునేందుకు ప్రయత్నాలు

AP: తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా భయాందోళనలు సృష్టిస్తున్న పెద్దపులిని పట్టుకోవడానికి అటవీశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పూణె నుంచి నిపుణుల బృందం రానుంది. పులిని మత్తు ఇంజక్షన్ ద్వారా పట్టుకోవడానికి 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. స్థానికులు భయపడాల్సిన పనిలేదని, రాత్రిపూట ఇళ్లలో నుంచే ఉండాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతిరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్