తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు

తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటో ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.30గా ఉంటుంది. అలాగే, ఆటోలో గరిష్ఠంగా 100 కిలోల వరకు సామాను అనుమతించనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కొత్త ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్

✕
✕