హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా సభలు, కార్యక్రమాలు, బహిరంగసభలు, ఐదుగురికి మించి గుమిగూడకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అమలు చేసిన సెక్షన్-163ని వెంటనే ఎత్తివేయాలని సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ నేత బక్కజడ్సన్ డిమాండ్ చేశారు. వెంటనే ఈ సెక్షన్-163ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ NHRCలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మానవ హక్కులను కాలరాస్తూ సీఎం నెల రోజుల పాటు ఆంక్షలు విధించడం ఏంటని నిలదీశారు.