జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవు

జూలై నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో 4 ఆదివారాలు, 2 శనివారాలు, 6 ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సెలవులు ఉన్నాయి. అయితే ఈ 6 అదనపు ప్రాంతీయ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వర్తించవు. కేవలం ఆయా రాష్ట్రాలు, నగరాల్లోని బ్యాంకులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. జూలై 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారాలు, జూలై 11, 25 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి.

సంబంధిత పోస్ట్