TG: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ సదస్సుకు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. తొలిరోజు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్’ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.