నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు.. తక్కువ ధరకే ప్రయాణం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ అందించింది. తక్కువ ధరకే సురక్షిత ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను ఫిబ్రవరి 5న అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ర్యాపిడో, ఓలా, ఉబర్‌లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్‌లో బైక్, ఆటో, కార్ సేవలు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా జీరో కమిషన్ విధానం అమలు చేయనున్నారు. అలాగే హెల్త్, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్