దేశవ్యాప్తంగా PF అకౌంట్లు ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPFO వడ్డీ రేటును తగ్గించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం 8.25%గా ఉన్న వడ్డీని 8.20% లేదా 8%కు తగ్గించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి ప్రారంభంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వడ్డీ తగ్గితే కోట్లాది ఉద్యోగుల పీఎఫ్ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.