త్వరలో గ్రామాల్లో జీవ ఉత్పత్తుల వనరుల కేంద్రాలు

గ్రామాల్లో జీవ పదార్థాలు, కీటక నాశినులు, సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తెచ్చేందుకు జీవ ఉత్పత్తుల వనరుల కేంద్రాల(బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్-BRC)ను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహజ వ్యవసాయ జాతీయ మిషన్‌లో భాగంగా వీటిని స్థాపించనుంది. ఈ మేరకు HYDలోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్- నిర్మ్) ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. వీటి ఏర్పాటుకు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ద్వారా గ్రాంటు లభిస్తుంది.

సంబంధిత పోస్ట్