తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని ప్రభుత్వం విస్తరించనుంది. డిసెంబర్ 9న అన్ని జిల్లాల్లో సెంట్రల్ కిచెన్లను ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. వీటి ద్వారా రోజూ 25 లక్షల మందికి పైగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. నవంబర్ 30 నాటికి కిచెన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యత, పంపిణీని హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు.