BREAKING: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త కమిషన్ ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్