TG: రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం సిట్ విచారణకు బీఎస్పీ నేత వట్టె జానయ్య హాజరయ్యారు. ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. కాగా జానయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో జానయ్య ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించి.. తాజాగా విచారణకు పిలిచారు.