ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి ఎంఎస్ఎంఈ (MSME) రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ఎస్ఎంఈ (SME) గ్రోత్ ఫండ్ ను ఏర్పాటు చేయనుంది. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు 'సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్' ద్వారా రూ.2వేల కోట్లు కేటాయించింది. మూడు అత్యాధునిక కెమికల్ పార్కుల ఏర్పాటు, కంటైనర్ తయారీ రంగానికి రూ.10వేల కోట్లు కేటాయింపుతో మౌలిక వసతుల్లో స్వయం సమృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఫైబర్ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నేషనల్ ఫైబర్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది.