బడ్జెట్‌ ఎఫెక్ట్: పెరిగేవి.. తగ్గేవి ఇవే!

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ఈ నిర్ణయాలతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, మరికొన్నింటిపై భారం తగ్గనుంది. విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌ల ధరలు పెరిగే అవకాశముంది. మరోవైపు క్యాన్సర్‌, డయాబెటిస్‌ ఔషధాలు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్‌, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రోవేవ్‌లు, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల ధరలు తగ్గనున్నాయి. దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్‌ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్