అమరావతి-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు: అశ్వినీ వైష్ణవ్

AP: అమరావతి–హైదరాబాద్ మధ్య త్వరలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం 70 నిమిషాల్లో, అలాగే చెన్నైకు 112 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రాంతీయ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్