రబీ సీజన్ 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కుసుమకు క్వింటాల్‌కు రూ.675, ఆవాలు-రాప్సీడ్కు రూ.413, మసూర్ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున ధరలు పెరిగాయి. ఈ పెంపుతో గోధుమ MSP రూ.2,610, శనగ రూ.5,958, మసూర్ రూ.7,390, ఆవాలు రూ.6,613, కుసుమ రూ.7,215, బార్లీ రూ.2,286కు చేరాయి.