TG: రైతు భరోసాపై కేబినెట్‌ సబ్ కమిటీ కీలక నిర్ణయం

తెలంగాణలో ప్రభుత్వం ఇవ్వనున్న రైతు భరోసాపై గురువారం నిర్వహించిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. సర్వే, శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా సాగు భూములు గుర్తించి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు కానుంది.

సంబంధిత పోస్ట్