తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ బీసీ జేఏసీ ఇవాళ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూషన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలోని చాలా కాలేజీలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నో రోజులుగా బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కాలేజీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.