పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న CPS ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సామూహిక సెలవు పాటించాలని స్టేట్ CPSEU పిలుపునిచ్చింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో OPS హామీని ప్రకటించిన నవంబర్ 17నే సెలవుగా ఎంచుకున్నట్లు తెలిపింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో CPS రద్దు చేసినట్లుగా తెలంగాణలోనూ రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేసింది. కాగా నిన్న(మంగళవారం) ఉద్యోగులు హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టారు.